మన భారతీయులు ఎక్కువగా టీ తాగుతూ ఉంటారు. కొందరి ఇళ్ళల్లో అయితే రోజుకి నాలుగైదు సార్లు వరకు టీ తాగుతూ ఉంటారు. అయితే కొన్ని కాన్సర్, హృదయ సంబంధిత సమస్యలను తగ్గించే గుణాలు కూడా టీలో ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.
ఇండియాలో అత్యధికంగా తాగేటువంటి వాటి లో టీ కూడా ఒకటని చెప్పవచ్చు. మిల్క్ టీ తాగడం వల్ల ఆరోగ్యానికి అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.
మరి వాటికి సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ప్రతిరోజు ఉదయం లేవగానే ఎక్కువమంది టీ తాగడం అలవాటుగా ఉంటుంది. అయితే అది కూడా మిల్క్ టి తాగడానికి ఎంతో రుచిగా ఉన్నప్పటికీ ఆరోగ్యానికి కూడా అంతే హానికరమని వైద్యులు తెలియజేస్తున్నారు. మిల్క్ టీ లో ఉండే టైనిన్ అనే పదార్థం అనారోగ్య సమస్యలకు దారితీస్తుందట. అందుచేతనే మిల్కీ టీతో కలిగే సమస్యలు చాలానే ఉన్నాయట.
మిల్క్ టీ తరచు తాగడం వల్ల కడుపులో దుష్ప్రభావం కలుగుతుందట. దీనివల్ల అజీర్ణం మలబద్ధకం వంటి సమస్యలు కూడా తలెత్తుతాయని వైద్యులు తెలియజేస్తున్నారు.
మిల్క్ టీ తరచు తాగడం వల్ల కడుపులో దుష్ప్రభావం కలుగుతుందట. దీనివల్ల అజీర్ణం మలబద్ధకం వంటి సమస్యలు కూడా తలెత్తుతాయని వైద్యులు తెలియజేస్తున్నారు.
మిల్క్ టీ తాగడం వల్ల ఎముకలు చాలా బలహీనంగా మారుతాయట ఇందులో ఉండే టైటిల్ క్యాల్షియంను గ్రహించి ఎముకలని చాలా బలహీనతగా మార్చేలా చేస్తుంది.మిల్క్ టీ తరచూ తాగుతూ ఉండడం వల్ల నిద్రలేని సమస్య కూడా ఏర్పడుతుందని వైద్యులు తెలియజేస్తున్నారు. ఇందులో ఉండే కెఫెన్ పదార్థం వల్ల నిద్ర రాకుండా చేస్తుంది ఫలితంగా అధిక ఒత్తిడి వల్ల కంటి కింద డార్క్ సర్కిల్స్ వంటివి ఏర్పడతాయి.
అయితే ఎక్కువగా మిల్క్ టీ తాగడం వల్ల చాతిలో మంట వేస్తుందట. దీంతో కడుపులో గ్యాస్టిక్ సమస్య కూడా ప్రారంభమవుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.
తరచు తాగుతూ ఉండడం వల్ల అదొక బానిసతత్వంగా మారిపోతుంది. దీని వల్ల పలు ఆరోగ్య సమస్య లు కూడా కోరుచున్నట్లుగా అవుతుందని చెప్పవచ్చు.
అందుచేతనే దీని కానీ కాఫీ ని కానీ ప్రతి ఒక్కరు వీలైతే తగ్గించడం చాలా మంచిదని నిపుణులు తెలియజేస్తున్నారు. వీటిని ఎక్కువగా తాగడం వల్ల ఆకలి వేయకపోవడం వల్ల పలు సమస్యలు కూడా ఎదురవుతాయి.