టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత మనీ ట్రాన్స్ఫర్ చేయడం, పేమెంట్స్ చేయడం చాలా సులువైపోయింది. స్మార్ట్‌ఫోన్‌లో యాప్స్ ఉపయోగించి సులువుగా లావాదేవీలు చేసేస్తున్నారు. లక్షల రూపాయల ట్రాన్సాక్షన్స్ కూడా క్షణాల్లో జరిగిపోతున్నాయి. టెక్నాలజీ పెరిగిన తర్వాత లావాదేవీలు సులువయ్యాయి కానీ… మోసాలు కూడా పెరిగిపోయాయి
ఏటీఎం కార్డు మోసాలు, క్రెడిట్ కార్డ్ ఛీటింగ్స్ ఎక్కువయ్యాయి. అంతేకాదు… ఇటీవల యూపీఐ మోసాలు కూడా పెరిగాయి. గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం లాంటి యూపీఐ సేవల్ని వాడుతున్నవారిని సింపుల్‌గా మోసం చేస్తున్నారు నేరగాళ్లు. దీంతో ఇలాంటి మోసాలపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఖాతాదారుల్ని అలర్ట్ చేస్తోంది
ప్రస్తుతం చాలామంది ఫోన్ పే, గూగుల్ పే యాప్ లను వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు దర్జాగా ఇంట్లో కూర్చొని అన్ని పనులను ఫోన్ల ద్వారానే చేసుకుంటున్నారు.
ప్రస్తుతం వ్యాపార వ్యవహారాలను ఆన్లైన్ లోనే జరుగుతున్నాయి. ఫోన్ పే, గూగుల్ పే, అమెజాన్ పే వంటి యాప్‌లతో నగదు బదిలీ చేస్తున్నారు. ఇలా చాలా ఆర్థిక వ్యవహారాలన్నీ క్షణాల్లో జరిగిపోతున్నాయి. ప్రజలు కూడా ఈ మధ్యన వీటిని వాడేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఎవరు కూడా లిక్విడ్ క్యాష్ వాడడం లేదు. అంతా ఆన్లైన్ పేమెంట్స్ చేయడానికి మొగ్గు చూపుతున్నారు. ఇంకా భవిష్యత్తులో మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అకౌంట్ లో నుంచి క్షణాలు డబ్బులు పంపే యాప్‌లు రావడంతో యూజర్లు ఈజీగా వ్యవహారాలు పూర్తవుతున్నాయి.
ఏ పేమెంట్ చేయాలన్న ఆన్లైన్ లోనే జరిగిపోతున్నాయి. గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆదేశాలతో ఫోన్ పేz గూగుల్ పే లకు షాక్ తగలనుంది. పేమెంట్ యాప్స్ మార్కెట్ షేర్ 30 శాతానికి పరిమితం కావాలని కేంద్రం ఇచ్చిన ఆదేశాలు అమలులోకి వస్తే ఫోన్ పే, గూగుల్ పే యాప్ లకు బారి నష్టాలు కలగనుంది. ఫోన్ పే 46.7 షేర్ గూగుల్ పే 33.3 షేర్ నష్టపోనున్నాయి. దీంతో వ్యాపార లావాదేవీలపై ప్రభావం పడనుంది. దీనిపై సదరు యాజమాన్యాలు కేంద్రం తీసుకుని నిర్ణయం మూడేళ్లు పొడిగించాలని కోరుతున్నాయి. మరోవైపు పేటీఎం, వాట్సాప్ అమెజాన్ పే లకు లాభం కలగనుంది. దీంతో కేంద్రం తమ ఆదేశాలని వాయిదా వేస్తుందా లేక అమలుపరుస్తుందా అని అనుమానాలు వస్తున్నాయి.
ఫోన్ పే మరియు గూగుల్ పే యూజర్లకు బ్యాడ్ న్యూస్ :-
ఈ క్రమంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయం పై ఆన్లైన్ సంస్థలకు కొన్నింటికి నష్టాలు మరికొన్నింటికి లాభం కలుగునుంది. దీనిపై కేంద్రం ఎలా ముందుకు వెళుతుంది అనేది తెలియడం లేదు. ఫోన్ పే, గూగుల్ పే లకు జరిగే నష్టంతో అవి ఎలా స్పందిస్తాయో అనేది సందేహమే. ఆన్లైన్ యాప్ లను ప్రజలు బాగా వాడుతున్నారు. ఫోన్ పే, గూగుల్ పే లతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నగదు బదిలీలు జరుగుతున్నాయి. ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లో కూర్చుని చేసుకోగలుగుతున్నారు. దీన్ని కొనసాగించేందుకు ఆ సంస్థలు ముందుకు రావడంతో ప్రజలకు కూడా తమ సమయం ఆదా అవుతుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఫోన్ పే, గూగుల్ పేలు ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని కోరడంతో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది తెలియడం లేదు.