చెంబు నీళ్లతో 60 సంవత్సరాల వరకు విద్యుత్…

నూక్లియర్ ఫ్యూజన్ – అణు సంయోగం
ఇవాళ అమెరికా శాస్త్రవేత్తలు ఫ్యూజన్ పరిశోధనల్లో ఒక కీలకమైన అంశాన్ని ప్రకటించారు.
రెండు అణువుల్ని కలిపినా ,విడదీసినా శక్తి పుడుతుంది. ఆ రెండు అణువుల్ని కలిపితే సంయోగం(ఫ్యూజన్) అంటారు, విడదీస్తే విచ్చిత్తి(ఫిజన్) అంటారు. ఈ రెండు(ఫ్యూజన్&ఫిజన్) జరిగినప్పుడు ఆ అణువులు కొంత ద్రవ్యరాశి కోల్పోయి శక్తిని విడుదల చేస్తాయి.


Einstine theory (E = mc²)అన్నది అందరికీ తెలిసిన సూత్రమే. ఈ theory లో m=ఆ అణువులు కోల్పోయిన ద్రవ్యరాశి. E=ఆ ప్రక్రియలో విడుదల అయ్యే శక్తి. c=కాంతి వేగం.
ప్రపంచంలో వున్న 450 పైగా న్యూక్లియర్ రియాక్టర్లు వున్నాయి. ఈ నూక్లియర్లో రియక్టర్లు ను ఫిజన్ చేసి అణువులను విడగొట్టి శక్తిని రాబట్టి, దాని ద్వారా విద్యుత్తు తయారు చేస్తున్నారు. కానీ దీనివల్ల చాలా ప్రమాదాలున్నాయి. 1986 ఏప్రిల్ 26న జరిగిన చెర్నోభిల్ ప్రమాదం ఇప్పటికీ మర్చిపోలేని సంఘటన.ఈ ప్రమాదం నుండీ ఈ మధ్య జపాన్‌లో 2011 మార్చ్ 11న వచ్చిన సునామీ వల్ల దెబ్బతిన్న అణు రియాక్టర్ నుండి రేడియో ధార్మిక పదార్థాలు వాతావరణంలో కలిశాయి.

అలాగే ఫ్యూజన్ ద్వారా ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకశాలు ఉండవు అని శాస్త్రవేత్తలు చెప్తుతున్నరు. ఈ ఫ్యూజన్ ద్వారా ఉత్పత్తి అయ్యే శక్తి, ఫిజన్ కంటే 4 రెట్లు ఎక్కువ..ఇకపోతే ఫ్యూజనుకు పక్రియకు కావల్సిన ఇంధనం కేవలం హైడ్రోజన్ అణువులు. ఈ హైడ్రోజెన్ అణువులు సముద్రజలాల్లో చాలా వున్నాయి.

విడగట్టడం, పడగొట్తడం కంటే కలపడం చాలా శ్రమతో కూడుకున్నదే రెండు అణువుల్ని కలపడమంటే రెండు అణువుల్లోన్ని కేంద్రకాలను కలపడం. రెండు కేద్రకాల్లోనూ ధనాత్మక ప్రొటాన్లే వుంటాయి గనుక అవి వికర్శించుకుంటాయి. రెండు అయస్కాంతాల ఉత్తర ధృవాలనో, దక్షణ ధృవాలనో ఒకచోటికి మనం చేర్చాలని ప్రయత్నిస్తే బలంగా దగ్గరికి చేర్చాలి.. వాటిని కలపడం అంటే ఎక్కువ ఒత్తిడి వాటిమీద పెట్టాలి. అంత ఒత్తిడి కలిగించాలంటే చాలా శక్తి కావాలి. అంత శక్తీ ఉపయోగించి వాటిని కలిపితే తీరా అవి వుత్పత్తి చేసే శక్తి మనం ఖర్చు పెట్టిన శక్తి కంటే తక్కువే అయితే దానివల్ల ఏమి ప్రయోజనం. ఇప్పటి వరకూ పరిశోధనాశాలల్లో అణు సంయోగం చేసి శక్తి విడుదల అయినట్లు తెలిసినా, ఆ సంయోగానికి పెట్టే శక్తి చాలా ఎక్కువగా వుంటోంది. ఇప్పుడు మొదటిసారిగా అమెరికా శాస్త్రవేత్తలు తాము ఖర్చు పెట్టిన శక్తి కన్నా ఎక్కువ శక్తిని సంయోగం ద్వారా రాబట్టాము అంటున్నారు.

ఈ ఫ్యూజన్ టెక్నాలజీ విజయవంతం అయితే చెంబు నీళ్ళతో ఓ కుటుంబానికి 60 ఏళ్ళపాటు కావల్సిన విద్యుత్తు తయారు చేయవచ్చు అని శాస్త్రవేత్తలు అంటున్నారు. పైగా ఎటువంటి కాలుష్యమూ విడుదల అవదు. ఏదైనా పొరబాటు జరిగినా దానికది ఆగిపోతుందే తప్ప ఇప్పుడున్న ఫిజన్ రియాక్టర్లలా జీవజాలానికి ముప్పు అయ్యే రేడియో ధార్మిక పదార్థాలను చిమ్మదు.

ఈ ప్రయోగాలు ఎంతో ఖర్చుతో కూడుకున్నవి గనుక చిన్న చిన్న దేశాలు, కంపెనీలు చేయలేవు. యూరోపియన్ యూనియన్, అమెరికా, రష్యా, ఇండియా, జపాన్, చైనా కలిసి వుమ్మడిగా ఫ్రాన్సులో ఒక పెద్ద ప్రయోగశాల నిర్మిస్తున్నాయి.

సూర్యూడు తదితర నక్షత్రాల్లో అణుసంయోగం ద్వారానే శక్తి విడుదల అవుతుంది.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *