“దీపావళి షాపింగ్‌లో అదిరిపోయే స్పెషల్ ఆఫర్స్”. వివరాలు!

“దీపావళి షాపింగ్‌లో అదిరిపోయే స్పెషల్ ఆఫర్స్”. వివరాలు!

కొన్ని వారాల క్రితమే ఇండియాలో పండుగ ఆఫర్ల సీజన్‌ మొదలైంది.  దీపావళి పండగ దగ్గర పడటంతో ఆఫర్ల సందడి మరింత పెరిగింది.   ఈ సందర్భంగా ఇళ్లు, కార్లు, గృహోపకరణాలు, ఇతర వస్తువులను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో కస్టమర్లను ఆకట్టుకునేందుకు బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFC), హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ (HFC)లు వివిధ రకాల ఆఫర్లు, డిస్కౌంట్లను ప్రకటించాయి. మీరు కూడా ఈ దీపావళికి షాపింగ్ చేయాలనుకుంటే, స్పెషల్ ఆఫర్లతో ఎలా ఎక్కువ లబ్ధి పొందాలో తెలుసుకోండి.

నిర్ణీత వ్యవధిలో నిర్ణీత మొత్తాన్ని ఖర్చు చేసిన కస్టమర్లకు ఇచ్చే స్పెషల్ బెనిఫిట్స్‌ను స్పెండ్ బేస్డ్ ఆఫర్లు అంటారు. కస్టమర్లు ఒక లిమిట్‌ దాటి ఖర్చు చేసిన తర్వాత క్యాష్‌బ్యాక్,  గిఫ్ట్  వోచర్, బోనస్ రివార్డ్‌లు, ప్రీమియం ప్రివిలేజెస్‌, కాంప్లిమెంటరీ యాక్సెస్ వంటి బెనిఫిట్స్‌ను బ్యాంకులు అందిస్తాయి.

పండుగ సీజన్‌లో దాదాపు అన్ని క్రెడిట్ కార్డ్‌లపై బ్యాంకులు బెస్ట్‌ డీల్స్‌ అందిస్తాయి. క్రెడిట్, డెబిట్ కార్డ్‌ల ద్వారా లావాదేవీలు జరిపే కస్టమర్లందరికీ బ్యాంకులు స్పెషల్ ఆఫర్లను అందిస్తున్నాయి. అయితే అవసరమైన వస్తువులను క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్లతో కొనుగోలు చేస్తే, కస్టమర్లు ఎక్కువ డబ్బు ఆదా చేసే అవకాశం ఉంటుంది.

క్యాష్‌బ్యాక్‌, డిస్కౌంట్‌ ఆఫర్లతో ప్రొడక్ట్ ధరలో కొంత తగ్గింపు లభిస్తుంది. ఇవి సాధారణంగా ఏడాది పొడవునా అందుబాటులో ఉంటాయి. పండుగల సీజన్‌లో వీటికి డిమాండ్‌ మరింత పెరుగుతుంది. గాడ్జెట్లు, దుస్తులు, ఇల్లు, వంటగదికి అవసరమైన వస్తువులు, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ డివైజెస్‌ కొనుగోలు చేయాలని చూస్తున్న కస్టమర్లు ఇలాంటి ఆఫర్లతో లబ్ధి పొందవచ్చు. ముఖ్యంగా ఎంపిక చేసుకునే సెల్లింగ్ ప్లాట్‌ఫామ్ నుంచి కొన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డులతో చేసే ట్రాన్సాక్షన్లపై మరింత ప్రయోజనం పొందవచ్చు.

బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమ రిపీట్ కస్టమర్లు, ఇప్పటికే ఉన్న ప్రైమ్‌ కస్టమర్లకు ప్రీ అప్రూవ్డ్ లోన్లను ఆఫర్‌ చేస్తాయి. చాలా బ్యాంకులు ప్రీమియం క్రెడిట్ కార్డులపై, ప్రిఫరెన్షియల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ROI)పై పర్సనల్ లోన్, హై లోన్-టు-వాల్యూ (LTV)పై హోం లోన్‌, వాహనం ఎక్స్-షోరూమ్ విలువలో 100 శాతం వరకు కార్ లోన్ కోసం ప్రీ-క్వాలిఫైడ్ ఆఫర్‌లను అందిస్తాయి.

క్రెడిట్ కార్డ్‌పై లోన్‌, టాప్ అప్ లోన్ వంటి స్పెషల్ సీజనల్ ఆఫర్లతో ఏడాది పొడవునా తక్కువ వడ్డీ రేట్లతో క్రెడిట్ పొందవచ్చు. ప్రీ అప్రూవ్డ్‌ లోన్‌ ప్రాసెసింగ్‌ కూడా వేగంగా ఉంటుంది. పర్సనల్‌ లోన్‌, హోమ్ లోన్‌, కార్‌ లోన్‌, లోన్స్‌ ఎగైనెస్ట్ ప్రాపర్టీ (LAP) మొదలైన వాటిపై ప్రాసెసింగ్   ఫీజును పాక్షికంగా, పూర్తిగా మాఫీ చేసే ఆఫర్లతో కస్టమర్లు చాలా డబ్బు ఆదా చేసుకోవచ్చు.

సాధారణంగా రూ.50 లక్షల హోమ్ లోన్‌పై ప్రాసెసింగ్ ఫీజు రూ.10,000 వరకు ఉండవచ్చు. పండుగల సీజన్‌లో లోన్లను ఎంచుకుంటే ఈ మేరకు డబ్బు ఆదా అవుతుంది. కారు లోన్, హోమ్ లోన్ లేదా LAP వంటి పెద్ద లోన్లకు అప్లై చేసేవారు ప్రాసెసింగ్ ఫీజు మాఫీతో లబ్ధి పొందవచ్చు.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *