లాభాల్లో దూసుకుపోయిన స్టాక్ మార్కెట్, జీవితకాల గరిష్టాలకు సూచీలు;

లాభాల్లో దూసుకుపోయిన స్టాక్ మార్కెట్, జీవితకాల గరిష్టాలకు సూచీలు.

భారత స్టాక్ మార్కెట్లు(stock market) ఈరోజు కూడా లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ 18800 పాయింట్ల ఎగువకు వచ్చింది.సెన్సెక్స్ 63వేల పాయింట్ల పైన ముగిసింది.

ఆసియా మార్కెట్లు పాజిటివ్ గా, యూరప్ సూచీలు(stock market) బలంగా, యూఎస్ ఫ్యూచర్లు లాభాల్లో ఉండడంతో దేశీయ సూచీలు నేడు లాభాలతో ఆరంభమై చివరకు భారీ లాభాలతో ముగిశాయి.

నిఫ్టీ నేడు 54.15 పాయింట్ల లాభంతో 18,812.50 పాయింట్ల వద్ద ముగిసింది.

ఒకదశలో నిఫ్టీ 18,887.60 పాయింట్లకు కూడా వచ్చి ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ 184.54 పాయింట్ల లాభంతో 63,284.19 పాయింట్ల వద్ద ముగిసింది.

ఇది సెన్సెక్స్ జీవిత కాల గరిష్ట ముగింపు. ఒకదశలో సెన్సెక్స్ ఆల్ టైమ్ గరిష్టం 63,583 పాయింట్లను కూడా తాకింది. మిడ్ క్యాప్ సూచీ దాదాపు ఒక శాతం, స్మాల్ క్యాప్ సూచీ దాదాపు అర శాతం లాభాల్లో ముగిశాయి. రంగాల వారీగా ఆటో, ఫార్మా, ఎఫ్ఎంసీజీ మినహా అన్ని సెక్టోరియల్ సూచీలు లాభపడ్డాయి.

అమెరికాలో వడ్డీరేట్ల పెంపు విషయంలో వేగాన్ని తగ్గిస్తామన్న ఫెడ్‌ ఛైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ సంకేతాలతో ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగియగా యూరప్ మార్కెట్లు (stock market) కూడా లాభాల్లో ట్రేడవుతున్నాయి.

యూఎస్ ఫ్యూచర్లు లాభాల్లో ఉన్నాయి. నిఫ్టీకి ఎగువన 19000 పాయింట్ల వద్ద నిరోధం, దిగువన 18600 పాయింట్ల వద్ద మద్దతు లభిస్తాయి.

బ్రెంట్ క్రూడాయిల్ 88 డాలర్ల పైకి చేరగా, డాలర్ బలహీన పడింది. దేశీయ ఎకానమీ బలపడుతుందన్న అంచనాలు, డిసెంబర్ నెలలో సానుకూలతపై ఆశాభావం తదితర అంశాలు దేశీయ సూచీల్లో ర్యాలీకి కారణమయ్యాయని నిపుణులు అభిప్రాయపడ్డారు.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *