అక్టోబర్ 3న హాట్ ఫీచర్లతో మోటో జీ72 లాంఛ్‌

మొటోరోలా భారత్‌లో జీ సిరీస్ కింద బ్రాండ్ న్యూ స్మార్ట్‌ఫోన్ మోటో జీ72ను లాంఛ్ చేస్తోంది. అక్టోబర్ 3న లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ను కస్టమర్ల ముందుకు తీసుకువచ్చేందుకు కంపెనీ సన్నాహాలు చేపట్టింది.
మోటొరోలా  నుంచి త్వరలో మరో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. G సిరీస్ నుంచి రానున్న ఈ డివైజ్‌ పేరు మోటో G72  ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఇటీవల మల్టిపుల్‌ సెర్టిఫికేషన్స్‌ వెబ్‌సైట్‌లలో గుర్తించారు. G72 ప్రపంచవ్యాప్తంగా FCC, TDRA, IMEI డేటాబేస్‌లలో లిస్ట్‌ అయింది. అదే ఫోన్ భారతదేశంలోని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్డేటాబేస్‌లో కూడా కనిపించింది. దీంతో ఈ స్మార్ట్‌ఫోన్‌ భారతదేశంలో కూడా త్వరలో లాంచ్‌ అవుతుందని మొబైల్‌ మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. డివైజ్‌కి సంబంధించి ఆయా వెబ్‌సైట్‌లలో కొన్ని వివరాలు కనిపించాయి. స్మార్ట్‌ఫోన్‌ బ్యాటరీ సామర్థ్యం, ఛార్జింగ్ స్పీడ్‌ వంటి కొన్ని కీలక స్పెసిఫికేషన్‌లను అందించాయి. ఇప్పుడు ఓ కొత్త నివేదిక భారతదేశంలో ఈ ఫోన్ లాంచ్ టైమ్‌లైన్‌తో పాటు కొన్ని కీలక స్పెసిఫికేషన్‌లను వెల్లడించింది. ఆ వివరాలు తెలుసుకుందాం

న్యూఢిల్లీ :           మొటోరోలా భారత్‌లో జీ సిరీస్ కింద బ్రాండ్ న్యూ స్మార్ట్‌ఫోన్ మోటో జీ72ను లాంఛ్ చేస్తోంది. అక్టోబర్ 3న లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ను కస్టమర్ల ముందుకు తీసుకువచ్చేందుకు కంపెనీ సన్నాహాలు చేపట్టింది. పండగ సీజన్‌లో పలు స్మార్ట్‌ఫోన్‌లు అక్టోబర్‌లో భారత్ మార్కెట్‌లో ఎంట్రీ ఇవ్వనున్నాయి. గూగుల్ తన పిక్సెల్ 7 సిరీస్‌ను కూడా అక్టోబర్‌లో లాంఛ్ చేయనుంది. ఇక మోటో జీ72 లాంఛ్‌కు ముందు కంపెనీ కీ స్పెసిఫికేషన్స్‌ను వెల్లడించింది.

రానున్న స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉండనుంది. ఇంకా సేల్ డేట్ గురించి కంపెనీ ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. మోటో జీ 72 మెటియరైట్ గ్రే, పోలార్ బ్లూ కలర్స్‌లో రానుంది. మోటో లేటెస్ట్ ఫోన్ ఇన్‌స్క్రీన్ ఫింగర్‌ప్రింట్ స్కానర్‌తో ఐపీ52-రేటెడ్ వాటర్ రెపెల్లెంట్ సపోర్ట్‌తో కస్టమర్ల ముందుకు రానుంది. కెమెరా ఫీచర్ల విషయానికి వస్తే మోటో జీ72 ట్రిపుల్ కెమెరా సిస్టమ్‌తో కస్టమర్లను ఆకట్టుకోనుంది. 108ఎంపీ ప్రైమరీ కెమెరా, అల్ట్రా వైడ్ కెమెరాతో పాటు డెడికేటెడ్ మ్యాక్రో కెమెరా కలిగిఉంటుంది.

డాల్బీ అట్మాస్‌తో కూడిన డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయని కంపెనీ ఇప్పటికే వెల్లడించింది. లేటెస్ట్ మోటో ఫోన్ మీడియాటెక్ హెలియో జీ99 ఎస్ఓసీ చిప్‌సెట్‌తో 6జీబీ ర్యాం, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగిఉంటుంది. మోటో జీ72 స్టాక్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ అవుటాఫ్ ది బాక్స్‌పై రన్ అవుతుంది. 33డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో పనిచేస్తుంది.

 మోటో G72 లాంచ్ టైమ్, స్పెసిఫికేషన్లు
మోటో G72 స్మార్ట్‌ఫోన్‌ 4Gకి మాత్రమే సపోర్ట్‌ చేస్తుంది. ఈ ఫోన్‌ 5Gకి సపోర్ట్‌ చేయదని నివేదిక చెబుతోంది. మోటో G72 4G ఇండియన్‌ వేరియంట్‌కు ‘విక్టోరియా22’ అనే కోడ్‌నేమ్ ఉంది. దాని మోడల్ నంబర్ XT2255-2. ఇది BISలో గుర్తించిన మోడల్‌ నంబర్‌ కావడం గమనార్హం. లాంచ్ టైమ్‌లైన్ విషయానికొస్తే, ఈ డివైజ్‌ భారతదేశంలో సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో లాంచ్ అవుతుందని నివేదిక స్పష్టం చేస్తోంది

 ఇండియన్‌ వేరియంట్‌ ప్రత్యేకతలు

ఈ సెప్టెంబర్‌లో మోటరోలా ఎడ్జ్ 30 అల్ట్రా ఫోన్‌ను భారతదేశంలో లాంచ్‌ చేయనుంది. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ సెప్టెంబర్ 8న లాంచ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మోటో G72 ఎడ్జ్ 30 సిరీస్ ఫోన్ తర్వాత లాంచ్ అవుతుందని నిపుణులు భావిస్తున్నారు.

‘విక్టోరియా22’ కోడ్‌నేమ్‌తో రానున్న మోటో G72 4G స్మార్ట్‌ఫోన్‌లో 48ఎంపీ మెయిన్ స్నాపర్, 8ఎంపీ సెకండరీ షూటర్, 2ఎంపీ కెమెరాతో ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ ఉంటుంది. ఫోన్‌ ముందు భాగంలో 16ఎంపీ సెల్ఫీ స్నాపర్‌ ఉంటుంది. తాజా ఫోన్ కొత్త మీడియాటెక్ SoC లేదా హీలియో G37 చిప్‌సెట్‌తో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

రూ.15 వేల లోపు ఉండే అవకాశం

మోటో G72 4GB ఫోన్ వర్చువల్ రామ్ సపోర్ట్‌తో 6GB/8GB రామ్ ఆప్షన్‌లలో వస్తుంది. సెర్టిఫికేషన్స్‌ వెబ్‌సైట్‌లలో గుర్తించిన వివరాల ప్రకారం, ఈ ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5,000mAh బ్యాటరీతో వస్తుంది. ధరపై ఎటువంటి సమాచారం లేనప్పటికీ, అందుబాటులో ఉన్న స్పెసిఫికేషన్‌ల ఆధారంగా దీని ధర రూ.10,000 నుంచి రూ.15,000 వరకు ఉండవచ్చని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *