బడ్జెట్‌కు కొద్ది రోజుల సమయమే ఉంది. ఆయా రంగాలకు సంబంధించిన కేటాయింపులపై అంచనాలను నిపుణులు వెల్లడిస్తున్నారు. విద్యారంగానికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై కొందరు నిపుణులు తమ అభిప్రాయాలు వెల్లడించారు
గత బడ్జెట్లో డిజిటల్ యూనివర్సిటీ((డిజిటల్ విశ్వవిద్యాలయం), వన్-క్లాస్-వన్ ఛానల్,పీఎం గతి శక్తి మాస్టర్ ప్లాన్, టెలి-మెంటల్ హెల్త్ వంటి వాటిని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఈ రంగంలో తీసుకురావాల్సిన మార్పులు చాలా ఉన్నాయని చెబుతున్నారు బెంగళూలోనిఆరేవీయూనివర్సిటీ వ్యవస్థాపక వైస్ ఛాన్సలర్, ప్రొఫెసర్ వైఎస్ఆర్ మూర్తి. న్యూస్18తో మాట్లాడుతూ.. భారతదేశం ప్రపంచానికి నిజమైన డిజిటల్ హబ్‌గా మారాలని అభిప్రాయపడ్డారు. బడ్జెట్‌పై విద్యారంగ నిపుణుల అంచనాలను పరిశీలించండి.
విద్యారంగానికి కేటాయింపులు
గతేడాది విద్యారంగానికి 2.6 శాతం బడ్జెట్ కేటాయించారు. ప్రస్తుత బడ్జెట్లో 6 శాతం కాకపోయినా కనీసం 3-3.5 శాతమైనా కేటాయిస్తారనిగీతంప్రెసిడెంట్, కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ వ్యవస్థాపకుడు శ్రీ భరత్ మతుకుమిల్లి అంచనా వేశారు. కేంద్ర బడ్జెట్ 2022లో విద్యా రంగానికి మొత్తం రూ.1,04,278 కోట్లు కేటాయించారు. ఇది 2021 కంటే రూ.11,054 కోట్లు ఎక్కువ. విద్యా బడ్జెట్ కేటాయింపు 2021లో రూ.93,223 కోట్లుగా ఉంది. గుర్గావ్లోని గ్రేట్ లేక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లోని ఎకనామిక్స్ ప్రొఫెసర్ డాక్టర్విప్ సింగ్ న్యూస్18తో మాట్లాడుతూ.. ప్రధాన వ్యయం ప్రైవేట్ రంగం నుంచి రావాలని, భారీ డిమాండ్ ఉందని తెలిపారు. మంచి బి-స్కూల్స్‌కు 240 సీట్లుకు 5,000 వరకు దరఖాస్తులు వస్తాయన్నారు. 20 రెట్లు ఎక్కువ డిమాండ్ కనిపిస్తోందని చెప్పారు. ఉన్నత విద్యా మార్కెట్ కచ్చితంగా సెల్లర్స్ మార్కెట్ అని పేర్కొన్నాసరైన వనరుల కేటాయింపు, వాటిని సమర్థవంతంగా ఉపయోగించడం ద్వారా భారతదేశ2020 లక్ష్యాలను సాధించగలదని ప్రొఫెసర్ మూర్తి అభిప్రాయపడ్డారు. ఉన్నత విద్యారంగంలో మూడింట రెండు వంతులు ప్రైవేట్ రంగం చేతుల్లో ఉన్నందున, ఆర్థిక, ఇతర ప్రోత్సాహకాల ద్వారా ప్రోత్సహించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రైవేట్ రంగం ముందుకు రావడానికి, కొత్త సంస్థలను స్థాపించడానికి వీలు కల్పించే వాతావరణాన్ని సృష్టించాలని సూచించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఈ రంగంలో చాలా అవసరమని తెలిపారు. మతుకుమిల్లి మాట్లాడుతూ..విద్యా వ్యవస్థను మార్చడానికి తక్షణ, ముఖ్యమైన అవసరం ఉందని, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సేవలను అందించేలా నైపుణ్యం కలిగిన మానవ వనరుల బృందాలు అవసరమన్నారు. ఉన్నత విద్యలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో(గేర్)ను 50 శాతానికి పెంచాలని సూచించారు.
బడ్జెట్ కేటాయింపుల సక్రమ వినియోగ2020లో పేర్కొన్న మార్పులకు దారి తీస్తుందనిసాయి ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ గ్రూప్ చైర్పర్సన్ డాక్టర్ సిల్పి సాహూ అన్నారు. ఉచిత లేదా రాయితీతో కూడిన ట్యూషన్ను అందించడం, పాఠశాల మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్ చేయడం, స్కాలర్షిప్లు, గ్రాంట్లను ఏర్పాటు చేయడం, సాంకేతికత ఆధారిత అభ్యాసాన్ని అందించడం వంటివి నెరవేర్చాలన్నారు. సిట్యుయేటెడ్ లెర్నింగ్ ఎన్విరాన్మెం(వృత్తి/ఇంటర్న్‌షిప్ (హార్డ్ స్కిల్స్), టాలెంట్ పైప్లైన్లలో పెట్టుబడి పెట్టడానికి యజమానులకు ప్రోత్సాహకాలు అందించాలని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన గేర్ లక్ష్యాలను సాధించడానికి ఆన్లైన్, హైబ్రిడ్ డిగ్రీ ప్రోగ్రామ్‌లను అందించడానికి విదేశాల్లోని ప్రముఖ విశ్వవిద్యాలయాలతో అధికారిక భాగస్వామ్యాన్ని సులభతరం చేయాలని చెప్పారు.
స్కిల్ డెవలప్మెంట్
నేర్చుకునే నాణ్యతను పెంపొందించడం, ఉపాధ్యాయుల వృత్తి నైపుణ్యాలను మెరుగుపరచడం, దృఢమైన మౌలిక సదుపాయాలను పెంపొందించడం, నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడం వంటి లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని రాబోయే బడ్జెట్లో విద్య ప్రధాన అంశాలను తప్పనిసరిగా ప్రస్తావించాలని గ్రీన్వుడ్ హై ఇంటర్నేషనల్ స్కూల్ ట్రస్టీ నిరు అగర్వాల్ చెప్పారు.