VLC మీడియా ప్లేయర్ పైన నిషేధం విధించిన ప్రభుత్వం..కంపెనీ ఏమి చేసిందంటే..!

 

VLC  మీడియా ప్లేయర్ భారతదేశంలో అత్యంత ప్రజాధారణ పొందిన మీడియా ప్లేయరల్లో ఒకటి. ఇప్పుడు ఈ మీడియా ప్లేయర్ పైన భారత ప్రభుత్వం నిషేధం విధించింది;

 

ఈ నిషేధాన్ని ఎందుకు విధించిందో అనే విషయాన్ని మాత్రం భారత ప్రభుత్వం ఇప్పటి వరకూ తెలియ చెయ్యలేడు. కానీ, VLC మీడియా ప్లేయర్ పైన ప్రభుత్వం పూర్తి నిషేదాన్ని విధించ లేదు. వాస్తవానికి, VLC మీడియా ప్లేయర్ ఎప్పటి మాదిరిగానే భారతీయ వినియోగదారులకు సరిగ్గానే పనిచేస్తుంది. అయితే, VLC యొక్క ప్రధాన వెబ్సైట్ ని మాత్రం ప్రభుత్వం చేత నిషేధించబడింది.

 

భారతీయ ఇంటర్నెట్ వినియోగదారులు ఎవరైనా వీడియోలాన్ వెబ్సైట్ను ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తే, వారు “మీరు అభ్యర్థించిన URL భారత టెలికమ్యూనికేషన్స్ ప్రభుత్వం నుండి వచ్చిన ఆదేశాల ప్రకారం బ్లాక్ చేయబడింది.” అనే మెసేజ్ ను అందుకుంటారు.

 

VLC యొక్క మాతృసంస్థ అయిన  వీడియోలాన్ ఈ విషయం గురించి స్పందిస్తూ, ఈ నిషేదానికి ఎటువంటి సంజాయిషి లేదా తమ వాదనలను వినిపించే అవకాశం కూడా తమకు ఇవ్వలేదని కంపెనీ చెప్పింది. అందుకే, దీనికి ప్రతి చర్యగా వారు భారత ప్రభుత్వానికి లీగల్ నోటీసు కూడా పంపినట్లు తెలియ చేశారు. ఈ నోటీసులో కంపెనీ తమను తాము రక్షించుకోవడానికి అవకాశం ఉండేలా సైట్ బ్లాక్ చేయడానికి అయిన కారణాన్ని అందించాలని వారు ప్రభుత్వాన్ని కోరినట్లు వెల్లడించారు.

 

VLC మీడియా ప్లేయర్ ఎందుకు నిషేధించబడింది?

 

ఇప్పటి వరకూ భారతదేశంలో VLC మీడియా ప్లేయర్ నిషేధానికి సంబంధించి భారత ప్రభుత్వం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనను విడుదల చేయ్యలేదు. అయితే, కంపెనీ ఈ చర్యకు దారితీసిన కారణాలను చెప్పాలని ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖను విజ్ఞప్తి చేస్తోంది. వాస్తవానికి, గతంలో ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకున్న ప్రతిసారీ కూడా అధికారికంగా స్టేట్మెంట్ ఇచ్చేది. అయితే, VLC మీడియా ప్లేయర్ బ్యాన్ విషయం లో మాత్రమే ఆలా జరగలేదు.

 

మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, VLC మీడియా ప్లేయర్ యాప్ ఇప్పటికీ గూగుల్ ప్లే స్టోర్ మరియు ఆపిల్ యాప్ స్టోర్ లో  అందుబాటులో ఉంది. భారతదేశంలో ప్రభుత్వం నిషేధించిన అన్ని యాప్స్ ను కూడా వెనువెంటనే ఈ రెండు స్టోర్ల నుండి తీసివేస్తుంది. కానీ ఈ యాప్ ఇంకా ఈ రెండు స్టోర్ లలో అందుబాటులో వుంది

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *