ఇవాళ్టి బ్రేకవుట్ స్టాక్స్ ఇవే.. 15 శాతానికిపైగా జంప్.. పండగ చేసుకుంటున్న ఇన్వెస్టర్లు..

ఇవాళ్టి బ్రేకవుట్ స్టాక్స్ ఇవే.. 15 శాతానికిపైగా జంప్.. పండగ చేసుకుంటున్న ఇన్వెస్టర్లు..

గత సెషన్‌లో రికార్డు స్థాయి లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలతో ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. చాలా వరకు షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. అయితే మార్కెట్లు నష్టాల్లో ఉన్నప్పటికీ కొన్ని షేర్లు ప్రైస్ వాల్యూమ్ బ్రేకవుట్‌ను నమోదు చేశాయి. చాలా వరకు అప్పర్‌సర్క్యూట్‌లో లాకయ్యాయి. కొన్ని 15 శాతానికిపైగా పెరగడం గమనార్హం. గత సెషన్‌లో BSE సెన్సెక్స్ జీవనకాల గరిష్టాన్ని తాకగా నిఫ్టీ 52 వారాల గరిష్టాన్ని తాకింది. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల పెంపుపై నెమ్మదించొచ్చన్న సానుకూల సంకేతాల నేపథ్యంలో కొంతలో కొంత ఉపశమనం లభించింది. నాస్‌డాకర్ కాంపొజిట్ సూచీ గత సెషన్‌లో 0.99 శాతం పెరగ్గా డౌ జోన్స్ సూచీ 0.28 శాతం లాభపడింది. ఎస్ అండ్ పీ 500 కూడా 0.59 శాతం మేర రాణించింది.

ప్రస్తుతం దేశీయ మార్కెట్లు ఒడుదొడుకుల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 100 పాయింట్ల నష్టంతో 62 వేల 170 వద్ద ఉండగా నిఫ్టీ 14 పాయింట్లు కోల్పోయి.. 18 వేల 460 వద్ద కొనసాగుతోంది. బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్, రియాల్టీ రంగం రాణిస్తుండగా FMCG సెక్టార్ మాత్రం ఒత్తిడిని ఎదుర్కొంటోంది.

వారాంతపు సెషన్‌లో హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, కోల్ ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, మారుతీ సుజుకీ రాణిస్తుండగా నెస్లే, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా, అపోల్ హాస్పిటల్, అదానీ ఎంటర్‌ప్రైజెస్ డీలాపడ్డాయి.

నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 0.9 శాతం పెరగ్గా నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ ఒక శాతం లాభపడింది. నవంబర్ 24 డేటా ప్రకారం.. ఫారెన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (FII) నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. ఏకంగా రూ.1231.98 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. డొమెస్టిక్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు నికర అమ్మకందారులుగా ఉన్నారు. ఏకంగా రూ.235.66 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు. అయితే ఇదే క్రమంలో కొన్ని షేర్లు ప్రైస్ వాల్యూమ్‌ను బ్రేకవుట్ చేసి దూసుకెళ్తున్నాయి.

 

 

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *