కన్నతల్లి విసిరేసింది… విదేశీ జంట చేరదీసింది… నిజంగా విధి అంటే ఇదేనేమో

దే మనకు రాసి లేకుంటే.. మందీ, మార్బలం ఉండీ.. ఒంటిపై ఈగ కూడా వాలునివ్వకూండా చూసుకునే బాడీగార్డులున్నా మరణం రానే వస్తుంది. ఉద్యోగం రాలేదనో..

పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనో ఆత్మహత్య చేసుకునే వారు ఈ వార్త చదివితే జీవితం ఎంత విలువైనదో అర్థం అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

కనికరం కూడా లేకుండా….
మహారాష్ట్రలోని థానే జిల్లాకు చెందిన శివాజీ రగడే, జయశ్రీ దంపతులు 2018, డిసెంబరు 30న రోడ్డుపై వెళ్తుండగా.. పక్కనున్న మురుగు కాల్వ నుంచి బిగ్గరగా ఏడుపు వినిపించింది. వెళ్లి చూస్తే అప్పుడే మగశిశువు కనిపించాడు. ఒంటినిండా గాయాలతో, బక్కచిక్కి పోయి ఉన్నాడు. ఇంటికి తీసుకెళ్లిన ఆ దంపతులు సపర్యలు చేసి ప్రాణాపాయం నుంచి తప్పించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తర్వాత వైద్యం కోసం ముంబయిలోని వాడియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పిల్లాడి వైద్య ఖర్చుల కోసం సామాజిక మాధ్యమాల్లో అభ్యర్థించగా ఒక్క రోజులోనే దాదాపు రూ.10.42 లక్షల నిధులు సమకూరాయి.

టైగర్ పేరు పెట్టి….
ఆ దంపతులు కూడా పేదలు కావడంతో ఎవరికైనా దత్తత ఇవ్వాలని భావించారు. కానీ, చట్టపరంగా ఇబ్బందులు తలెత్తడంతో స్థానిక విశ్వ బాలక్‌ ఆశ్రమంలో చేర్పించారు. ‘టైగర్‌’ అని పేరు కూడా పెట్టారు. పుట్టిన వెంటనే మురుగు కాల్వలో విసిరేసినా మృత్యుంజయుడిగా నిలిచినందునే ఆ పేరు పెట్టినట్లు శివాజీ రగడే తెలిపారు.

దత్తత తీసుకున్న ఇటలీ జంట
ఆశ్రమ్‌ నిర్వాహకుల ద్వారా పిల్లాడి వివరాలు తెలుసుకున్న ఇటలీకి చెందిన దంపతులు ఆ చిన్నారిని దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చారు. చట్టపరమైన ప్రక్రియను పూర్తి చేసి తాజాగా వాళ్ల దేశానికి తీసుకెళ్లిపోయారు. టైగర్‌కు ఇంతటి అత్యుత్తమమైన జీవితం లభించడం తమకెంతో సంతోషంగా ఉందని శివాజీ దంపతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కన్నతల్లి కాదనుకుంటే.. ఆ పిల్లాడు విదేశానికి వెళ్లడం నిజంగా వింతే కదా.!

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *