కేవలం రూ. 18,499 కే ఐఫోన్ 12 మినీ స్మార్ట్ ఫోన్ ను సొంతం చేసుకోండి..

కేవలం రూ. 18,499 కే ఐఫోన్ 12 మినీ స్మార్ట్ ఫోన్ ను సొంతం చేసుకోండి..

ప్రీమియం స్మార్ట్ ఫోన్ లను తయారు చేసే సంస్థ అయిన ఆపిల్ కి చెందిన ఐఫోన్ ను తక్కువ ధరకే కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే ఇది మీ కోసమే. ఆపిల్ కి చెందిన ఐఫోన్ 12 మినీ ఇప్పుడు ఎన్నడూ లేనంత తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఆపిల్ ఐఫోన్ 12 మినీ ధర ప్రస్తుతం కంపెనీ అధికారిక వెబ్ సైట్ లో రూ. 59,900 గా ఉంది, అయితే మీరు ఫ్లిప్ కార్ట్ లో కేవలం రూ. 18,499 కు మాత్రమే ఈ స్మార్ట్ ఫోన్ ను పొందవచ్చు. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆపిల్ ఐఫోన్ 12 మినీ ధర ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ లో రూ. 37,999 గా ఉంది. ఆపిల్ అధికారిక వెబ్ సైట్ కంటే రూ. 21,901 తక్కువ ధరకే లభిస్తుంది. అలాగే ఫ్లిప్ కార్ట్ మీ పాత స్మార్ట్ ఫోన్ ను ఎక్స్చేంజ్ చేసినట్లయితే, అదనంగా రూ .17,500 తగ్గింపును అందిస్తోంది. దీంతో ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 20,499 కు తగ్గుతుంది. దీనితో పాటు మీరు సిటీ బ్యాంకు క్రెడిట్ కార్డును వినియోగించి ఈఎమ్ఐ ద్వారా ఈ ఫోన్ ను కొనుగోలు చేసినట్లయితే, అదనంగా మరొక రూ. 2,000 వరకు తగ్గింపును పొందవచ్చు.

అన్ని డిస్కౌంట్ లు పోను మీరు ఆపిల్ ఐఫోన్ 12 మినీని కేవలం రూ .18,499 కే పొందవచ్చు. ఐఫోన్ 12 మినీ స్మార్ట్ ఫోన్ ను ఆపిల్ 2020 సంవత్సరంలో విడుదల చేసింది. ఇది కంపెనీకి చెందిన మొదటి మినీ మోడల్. పెద్ద పెద్ద స్క్రీన్ లను కలిగి ఉన్న ఫోన్లకు బదులుగా అవే ఫీచర్స్ తో చిన్న సైజు స్క్రీన్ కలిగిన స్మార్ట్ ఫోన్లను వినియోగించే వారి కోసం ఆపిల్ ప్రత్యేకంగా ఈ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. అయితే, కంపెనీ ఊహించినంత ఆదరణ ఈ మినీ మోడల్ స్మార్ట్ ఫోన్లకు లభించలేదు.

అందుకే కంపెనీ ఇటీవల విడుదల చేసిన ఐఫోన్ 14 సిరీస్ స్మార్ట్ ఫోన్లలో ఐఫోన్ 14 మినీ వెర్షన్ ను తీసుకురాలేదు. దానికి బదులుగా ఇంకా పెద్ద స్క్రీన్ ను కలిగి ఉండే ఐఫోన్ 14 ప్లస్ మోడల్ ను విడుదల చేసింది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ కి మాత్రం మంచి ఆదరణ లభించింది. ఇక భవిష్యత్తులో ఆపిల్ మినీ వేరియంట్లను విడుదల చేసే అవకాశాలు లేవనే చెప్పాలి.

 

ఐఫోన్ 12 మినీ స్పెసిఫికేషన్స్ ను ఒకసారి పరిశీలిస్తే,

* 5.4 ఇంచ్ సూపర్ రెటీనా ఎక్స్డీఆర్ డిస్ ప్లే

* ఏ14 బయోనిక్ చిప్

* ఐఓఎస్ 16 ఆపరేటింగ్ సిస్టం

* 4 జీబీ ర్యామ్ + 64 జీబీ, 128 జీబీ, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియట్స్

* వెనుకవైపు 12 ఎంపీ మెయిన్ కెమెరా, 12 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరాతో కూడిన డ్యూయల్ కెమెరా సెట్ అప్

* ముందువైపు 12 ఎంపీ సెల్ఫీ కెమెరా

* 5జీ సపోర్ట్

* 2227 ఎంఏహెచ్ బ్యాటరీ

* 15 వాట్ వైర్ లెస్ ఛార్జింగ్ సపోర్ట్

* బ్లాక్, వైట్, రెడ్, గ్రీన్, బ్లూ, పర్ఫుల్ కలర్స్

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *