గూగుల్ పిక్సెల్7-7 Pro | 5జీ ఫోన్లు చాలా కాస్ట్‌లీ గురూ.. ధరెంతంటే?!

గూగుల్ పిక్సెల్ 7-7 Pro | 5జీ ఫోన్లు చాలా కాస్ట్‌లీ గురూ.. ధరెంతంటే?!
గూగుల్ పిక్సెల్ 7-7 Pro | గూగుల్ 5జీ ఫోన్.. పిక్సెల్ 7 & 7 ప్రో ఫోన్లు పిరం కానున్నాయి. రూ.59,999లకు పిక్సెల్ 7, రూ.84,999లకు 7ప్రో లభిస్తాయి.

గూగుల్ పిక్సెల్ 7-7 Pro | సెర్చింజన్ `గూగుల్‌` ఫ్లాగ్‌షిప్ 5జీ స్మార్ట్ ఫోన్ `గూగుల్ పిక్సెల్ 7`, `గూగుల్ పిక్సెల్ 7 ప్రో`ను భారతీయ కస్టమర్లకు కాస్ట్‌లీగా మారాయి. తాజాగా దేశీయ మార్కెట్‌లో ఆవిష్కరించిన పిక్సెల్ 7 ఫోన్ రూ.59,999 (729.36 డాలర్లు), పిక్సెల్ 7 ప్రో వేరియంట్ ధర రూ. 84,999 (1033.27 డాలర్లకు) లభిస్తుంది. పిక్సెల్ 7 సిరీస్ స్మార్ట్ ఫోన్‌తోపాటు స్మార్ట్ వాచ్‌, తొలి టాబ్లెట్‌, ఎయిర్‌బడ్స్‌ను కూడా ఆవిష్కరించింది గూగుల్‌. వచ్చే ఏడాది (2023) టాబ్లెట్‌ను మార్కెట్‌లోకి తీసుకొస్తామని తెలిపింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ నెల 13 నుంచి మొబైల్ యూజర్లు కొనుగోలు చేయొచ్చు. ఇప్పటికే ప్రీ-బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.

గూగుల్ పిక్సెల్ 7 వేరియంట్ ఫోన్ 6.3 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ స్క్రీన్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. 30 వాట్ల చార్జర్‌తో కలిపి 4270 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ అందుబాటులో ఉంటుంది. 8జీబీ రామ్ విత్ 128&256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ కెపాసిటీ కలిగి ఉంది. 50 మెగా పిక్సెల్ (ఎంపీ) డ్యుయల్ కెమెరా లభ్యం అవుతుంది. దీంతోపాటు 12 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరాతోపాటు 10.8 ఎంపీల ఫ్రంట్ కెమెరా ఫీచర్ ఉంటుంది. లెమన్ గ్రాస్‌, స్నో, ఒబ్జిడియాన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

12జీబీ రామ్ సామర్థ్యం గల పిక్సెల్ 7, పిక్సెల్ ప్రో ఫోన్ 6.7 అంగుళాల క్యూహెచ్డీ ప్లస్ స్క్రీన్‌తో వస్తున్నది. దీని ధర రూ.84,999. 4296 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఫీచర్ వస్తుంది. 12జీబీ రామ్‌తోపాటు 128 జీబీ, 256 జీబీ, 512 జీబీ స్టోరేజీ వేరియంట్లతో వస్తున్నది. హజెల్‌, స్నో, ఒబ్సిడియాన్ కలర్ ఆప్షన్లలో వస్తుంది.

పిక్సెల్ 7 ప్రో ఫోన్‌లో 50 మెగా పిక్సెల్ (ఎంపీ) మెయిన్‌, 12 ఎంపీ అల్ట్రావైడ్‌, 48 ఎంపీ టెలిఫొటో కెమెరా, 10.8 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఫీచర్లు ఉన్నాయి. ఆండ్రాయిడ్ 13, గూగుల్ టెన్సర్ జీ2 ప్రాసెసర్‌, ఫింగర్ ప్రింట్ సెన్సర్ డిస్‌ప్లే, ఫేస్ అన్‌లాక్ సిస్టమ్ తదితర ఫీచర్లు జత చేశారు.

గూగుల్ నూతనంగా ఆండ్రాయిడ్ 13, టెన్సర్ జీ2 ప్రాసెసర్ ఫీచర్లు ఉన్నాయి. ఇవి రెండు పిక్సెల్ ఫోన్లలో లభిస్తాయి. పిక్సెల్ సిరీస్ ఫోన్లలో ఆండ్రాయిడ్ 13 అప్‌డేట్ వస్తుంది. రెండు వేరియంట్లలో స్మార్ట్ వాచ్‌లనూ ఆవిష్కరించింది. బ్లూటూత్ లేదా వై-ఫై కనెక్టివిటీతో వచ్చే స్మార్ట్ వాచ్ 349 డాలర్లు, ఎల్టీఈ లేదా వై-ఫై కనెక్టివిటీ వేరియంట్ స్మార్ట్ వాచ్ 399 డాలర్లు (రూ.32,999) పలుకుతుంది. భారత్ మార్కెట్‌లో స్మార్ట్ వాచ్‌లు ఎప్పుడు లభ్యం అవుతాయన్న విషయమై స్పష్టత లేదు.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *