పోస్టాఫీసు లేదా బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు.. ఏది బెస్ట్‌.

 

గత కొంతకాలం నుంచి నిత్యావసరాల రేట్లు భారీగా పెరుగుతున్నాయి. దీన్నే బిజినెస్ పరిభాషలో ద్రవ్యోల్బణం అంటారు. సగటు మధ్య తరగతి కుటుంబాలు ఏదైనా కొనుగోలు చేయాలంటే అధిక డబ్బు వెచ్చించాల్సి వస్తుంది. ఈ సమయాల్లో పొదుపు సొమ్ము ఎంతో ఆసరాగా ఉంటుంది. ప్రతివ్యక్తి సురక్షితమైన భవిష్యత్తు కోసం వివిధ మార్గాల్లో పెట్టుబడి పెట్టాలని అనుకుంటాడు. ప్రస్తుతం స్టాక్ మార్కెట్ లేదా క్రిప్టోకరెన్సీలో పెట్టుబడి పెట్టడం వంటి అనేక ఎంపికలు ఉన్నప్పటికీ ఇవి రిస్క్‌తో కూడుకున్నవి. దీంతో చాలా మంది వెనకడుగు వేస్తారు. ఈ కారణంగా చాలా మంది బ్యాంకు లేదా పోస్టాఫీస్ స్కీమ్స్‌ (Post office schemes)లో పెట్టుబడి పెట్టడానికి మొగ్గు చూపుతున్నారు.

గత మూడు నెలల్లో భారతీయ రిజర్వుబ్యాంక్ (ఆర్బీఐ) 140 బేసిక్ పాయింట్లు రెపోరేట్ పెంచేసింది. ఇప్పుడు ఆర్బీఐ రెపోరేట్ 5.4 శాతం వద్ద ఉంది.దీనికి అనుగుణంగా పలు బ్యాంకులు తమ డిపాజిట్లపై వడ్డీరేట్లు పెంచేశాయి. సంప్రదాయ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పోస్టాఫీసు డిపాజిట్ సేవింగ్స్ స్కీమ్స్ పట్ల నమ్మకం గల పాత తరం ఇన్వెస్టర్లకు ఇది శుభవార్తగా మారింది.కరోనా మహమ్మారి వేళ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కీలక వడ్డీరేట్లు తగ్గించడంతో స్మాల్‌సేవింగ్స్ పథకాలు దెబ్బ తిన్నాయి. 2021-22 ద్వితీయార్థంలో అధిక ద్రవ్యోల్బణంతోపాటు డిపాజిట్లపై దశాబ్ధి నాటి వడ్డీరేట్లతో ఇన్వెస్టర్లు సమస్యలు ఎదుర్కొన్నారు. తాజాగా మారిన పరిస్థితుల్లో సంప్రదాయ ఇన్వెస్టర్లకు మంచి రోజులు వచ్చాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే పోస్టాఫీసు డిపాజిట్స్ పాపులర్‌:

చిన్న మొత్తాల ఇన్వెస్టర్లకు సొమ్ము ఆదా చేయడానికి పోస్టాఫీసు డిపాజిట్ పథకాలు చాలా పాపులర్‌. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై బ్యాంకులు ఇచ్చే సంప్రదాయ వడ్డీరేట్ల కంటే పోస్టాఫీసు డిపాజిట్ స్కీమ్‌లపై మెరుగైన వడ్డీ లభిస్తుంది. పోస్టాఫీసు డిపాజిట్స్ వంటి చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేట్లను కేంద్రం ప్రతి మూడు నెలలకోసారి సవరిస్తుంది. ఆర్బీఐ రెపోరేట్‌కు అనుగుణంగా సెప్టెంబర్ త్రైమాసికంలో చిన్న మొత్తాల పొదుపు పథకాలపై కేంద్రం వడ్డీరేట్లు సవరిస్తుందని అనుకున్నా, ఆచరణలో అదేమీ జరుగలేదు.

పోస్టాఫీసు టర్మ్ డిపాజిట్ ఇలా

ఐదేండ్ల మెచ్యూరిటీ గల టర్మ్ డిపాజిట్ పథకంపై 6.7 శాతం, ఏడాది గడువు గల టర్మ్ డిపాజిట్‌పై సెప్టెంబర్‌తో ముగిసే త్రైమాసికంలో పోస్టాఫీసు 5.5 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నది. ఈ పథకం కింద కనిష్టంగా రూ.1000 డిపాజిట్ చేయొచ్చు. గరిష్ట పరిమితి లేదు. ఐదేండ్ల మెచ్యూరిటీ పోస్టాఫీసు డిపాజిట్ పథకాలపై ఆదాయం పన్ను చట్టంలోని 80సీ సెక్షన్ కింద ఆదాయం పన్ను మినహాయింపు కోరొచ్చు.

5.6 శాతం వరకు ఎస్బీఐ ఎఫ్డీలపై వడ్డీ

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌.. ఎస్బీఐ.. ఏడాది నుంచి మూడేండ్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీరేటు 5.45 నుంచి 5.55 శాతం వడ్డీ ఆఫర్ చేసింది. మూడేండ్ల ఒక రోజు నుంచి ఐదేండ్ల గడువు గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5.6 శాతం వడ్డీ అందిస్తున్నది.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *