మీ జీమెయిల్ ఫుల్ అయిందా? మీ స్మార్ట్‌ఫోన్ ద్వారా బల్క్ ఈ-మెయిల్స్ ఎలా డిలీట్ చేయాలో తెలుసా?

మీ జీమెయిల్  అవసరం లేని స్పామ్ మెసేజ్‌లతో నిండిపోయిందా? ఈ అవసరం లేని ఈమెయిల్‌లు స్పామ్, క్యాంపెయిన్ మెసేజ్‌లు ఎలా డిలీట్ చేయాలో తెలుసా?

ఇలాంటి మెసేజ్‌ల కారణంగా మీ గూగుల్ డిస్క్‌ మొత్తం నిండిపోతుంది. తద్వారా ఎక్కువ మెమెరీ తీసుకుంటాయి. ఇలాంటి సందర్భాలలో.. క్రమం తప్పకుండా జీమెయిల్ క్లీన్ చేయడం మంచిది. ప్రతి ఈమెయిల్‌ను ఓపెన్ చేసి ఒక్కో మెసేజ్ డిలీట్ చేయాలంటే అది సాధ్యం కాదు. జీమెయిల్మెసేజ్‌లను కేటగిరీల ద్వారా ఫిల్టర్ చేయడం ద్వారా వాటిని పెద్దమొత్తంలో డిలీట్ చేసేందుకు యూజర్లకు అనుమతిస్తుంది.

గూగుల్ అధికారికంగా PC లేదా టాబ్లెట్ ద్వారా ఈమెయిల్‌లను పెద్దమొత్తంలో డిలీట్ చేయడానికి యూజర్లకు అనుమతిస్తుంది, కానీ, మీ స్మార్ట్‌ఫోన్ నుంచి నేరుగా ఒకేసారి పెద్దమొత్తంలో ఈమెయిల్‌లను డిలీట్ చేసేందుకు ఒక మార్గం ఉంది. జీమెయిల్ నుంచి ఈమెయిల్‌లను డిలీట్ చేయడానికి ప్రక్రియ డెస్క్‌టాప్, స్మార్ట్‌ఫోన్‌లలో ఒకేలా ఉంటుంది. మొబైల్ ఫోన్ యూజర్లు బ్రౌజర్ నుంచి వారి మెయిల్ ఐడీని ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం.

జీమెయిల్లోని ఈమెయిల్‌లను బల్క్‌లో ఎలా డిలీట్ చేయాలంటే?

– ఏదైనా బ్రౌజర్‌లో మీ డెస్క్‌టాప్ లేదా స్మార్ట్‌ఫోన్‌లో జీమెయిల్ని ఓపెన్ చేయండి.
– టాప్ లెఫ్ట్ కార్నర్‌లో ఉన్న ఇన్‌బాక్స్ సెక్షన్‌లో కింది బాణం గుర్తుపైక్లిక్చేయండి.

– అన్ని మెసేజ్‌లనుటాప్చేసి ఎంచుకోండి.
– మీరు మెసేజ్‌ల పేజీ కంటే ఎక్కువ కలిగి ఉంటే.. మీరు అన్నింటిని ఎంచుకోండి. ఆపై Click చేయవచ్చు.
– ట్రాష్లోని అన్ని మెసేజ్‌లను మూవ్ చేయడానికి Deleteపై క్లిక్ చేయండి.
– మీరు నిర్దిష్ట కేటగిరీ నుంచి పెద్దమొత్తంలో మెసేజ్‌లను డిలీట్ చేసుకోవచ్చు.
– బ్రౌజర్‌లో జీమెయిల్ని ఓపెన్ చేయాల్సి ఉంది.
– మీరు మెసేజ్‌లను డిలీట్ చేయాలనుకునే కేటగిరీ పేజీలో ఎంచుకోండి.

మీరు ప్రైమరీ, ప్రమోషన్, సోషల్ ఆప్షన్ల నుంచి ఎంచుకోవచ్చు.
– ఇప్పుడు మెసేజ్‌లలో ఎడమవైపు టాప్‌లో ఉన్న చెక్‌బాక్స్‌పైక్లిక్చేయండి.
– ఇప్పుడు ఆ కేటగిరీలోని అన్ని మెసేజ్‌లను ఎంచుకుని, డిలీట్పై క్లిక్ చేయండి.
– జీమెయిల్చదవని మెసేజ్‌లను బల్క్‌లో ఎలా డిలీట్ చేయాలి.

మీరు మీ ఇన్‌బాక్స్‌లో లేదా ప్రత్యేక కేటగిరీలో చదవని మెయిల్స్ డిలీట్ చేయొచ్చు..

– బ్రౌజర్‌లోజీమెయిల్ని ఓపెన్ చేయండి.
– ఇన్‌బాక్స్ లేదా ఇతర కేటగిరీ సెర్చ్ బాక్సులో లేబిల్:యు రీడ్ అని టైప్ చేసి ఎంటర్ Press చేయండి.
– జీమెయిల్మీ అన్ని చదవని ఈమెయిల్‌లను డిస్‌ప్లే చేస్తుంది.
– మీరు లేబిల్: రీడ్ ని సెర్చ్ చేయడం ద్వారా చదివిన మెసేజ్ లను కూడా ఎంచుకోవచ్చు.
– ఇప్పుడు మెసేజ్‌ల పైభాగంలో ఉన్న ‘సెలెక్ట్ అల్ బాక్స్’ క్లిక్ చేసి ఆపై ‘ఈ శోధనకు సరిపోయే అన్ని సంభాషణలను ఎంచుకోండి.’

ఇప్పుడు మీరు చదవని మెసేజ్‌లన్నింటినీ డిలీట్ చేయడానికి పైన ఉన్న డిలీట్ఐకాన్‌పై క్లిక్చేయండి.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *