ఈ ఫోన్లలో ఇకపై వాట్సాప్‌ బంద్..

ప్రముఖ ఇన్‌స్టాంట్‌ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ యూజర్ల భద్రత మేరకు పటిష్ఠ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా మెరుగైన ప్రైవసీ ఫీచర్ల ను పరిచయం చేస్తోంది..

అదే విధంగా పాత ఫోన్లలో వాట్సాప్‌ సేవలను నిలిపివేస్తోంది. ఎందుకంటే ఓల్డ్ ఫోన్స్ వాట్సాప్ లేటెస్ట్ వెర్షన్లకు లేదా అప్‌డేట్స్‌కి సరిగా సపోర్ట్ అందించలేవు. అలానే ఈ ఫోన్లలో కొత్త ఫీచర్లు వాడటం కుదరదు. పాత ఫోన్లలో వాట్సాప్ వాడేవారికి సెక్యూరిటీ అందించడం కూడా వాట్సాప్‌కి అసాధ్యం. ఇలా భద్రత, ఫీచర్ల పరంగా ఓల్డ్ ఫోన్స్‌లో తన సేవలను వాట్సాప్ యాప్ నిలిపివేస్తుంది. లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం, త్వరలోనే ఐఓస్ 10, ఐఓస్ 11 వెర్షన్లపై రన్ అవుతున్న ఐఫోన్‌ డివైజ్‌ల్లో వాట్సాప్ సేవలు బంద్ కానున్నాయి.

ఒక లేటెస్ట్ నివేదిక ప్రకారం, అక్టోబర్ 24 నుంచి ఐఓస్ 10, ఐఓస్ 11 వెర్షన్లపై పనిచేస్తున్న ఐఫోన్లలో వాట్సాప్ పని చేయదు. ఈ ఫోన్ల యూజర్లు అక్టోబర్ 24 నుంచి వాట్సాప్ వాడాలంటే కొత్త ఓస్ వెర్షన్‌కి అప్‌డేట్ చేసుకోక తప్పదు. నిజానికి అవుట్ ఆఫ్ ది బాక్స్‌గా ఐఓస్ 10, ఐఓస్ 11 వెర్షన్లతో చాలా ఐఫోన్స్ లాంచ్ అయ్యాయి. అయితే వాటిలో ఐఫోన్ 5, ఐఫోన్ 5సీ తప్ప మిగతా ఫోన్లన్నీ ఐఓస్ 11 కంటే హయ్యర్ ఐఓస్ వెర్షన్లకు అప్‌గ్రేడ్ చేసుకోవడం సాధ్యం అవుతుంది. అయితే తమ ఐఫోన్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవడానికి వీలు ఉన్నా ఇంకా లేటెస్ట్ వెర్షన్లకు అప్‌గ్రేడ్ చేసుకోని యూజర్లు అక్టోబర్ 24 నాటికి ఆ పని చేయడం మంచిది. లేదంటే యూజర్లు వాట్సాప్ సేవలను    ఉపయోగించుకోలేరు. ఒక లేటెస్ట్ నివేదిక ప్రకారం, అక్టోబర్ 24 నుంచి ఐఓస్ 10, ఐఓస్ 11 వెర్షన్లపై పనిచేస్తున్న ఐఫోన్లలో వాట్సాప్ పని చేయదు. ఈ ఫోన్ల యూజర్లు అక్టోబర్ 24 నుంచి వాట్సాప్ వాడాలంటే కొత్త ఓస్ వెర్షన్‌కి అప్‌డేట్ చేసుకోక తప్పదు. నిజానికి అవుట్ ఆఫ్ ది బాక్స్‌గా ఐఓస్ 10, ఐఓస్ 11 వెర్షన్లతో చాలా ఐఫోన్స్ లాంచ్ అయ్యాయి. అయితే వాటిలో ఐఫోన్ 5, ఐఫోన్ 5సీ తప్ప మిగతా ఫోన్లన్నీ ఐఓస్ 11 కంటే హయ్యర్వె ఐఓస్ ర్షన్లకు అప్‌గ్రేడ్ చేసుకోవడం సాధ్యం అవుతుంది. అయితే తమ ఐఫోన్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవడానికి వీలు ఉన్నా ఇంకా లేటెస్ట్ వెర్షన్లకు అప్‌గ్రేడ్ చేసుకోని యూజర్లు అక్టోబర్ 24 నాటికి ఆ పని చేయడం మంచిది. లేదంటే యూజర్లు వాట్సాప్ సేవలను ఉపయోగించుకోలేరు.అప్‌డేట్స్‌ను ఇన్‌స్టాల్ చేయడం కూడా కుదరదు. అందువల్ల, అక్టోబర్ 24 నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పని చేయదు. యాప్ పనిచేయడం         ఆగిపోతుందని ఓల్డ్ స్మార్ట్‌ఫోన్ల యూజర్లకు వాట్సాప్ ఇప్పటికే నోటిఫికేషన్ పంపుతోంది. ఓస్అప్‌గ్రేడ్ చేసుకోవాలని అలర్ట్ చేస్తోంది. అలానే ఆండ్రాయిడ్ 4.1 లేదా అంతకన్నా లేటెస్ట్ ఓ వాడితేనే వాట్సాప్ సేవలను పొందడం సాధ్యమవుతుందని గతంలో ఆ మెసేజింగ్ యాప్ స్పష్టం చేసింది.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *