సీతాఫలాన్ని పోషకాల ఘని అని ఎందుకంటారు.. డయాబెటిస్ ఉన్న వారు తినొచ్చా?

ప్రస్తుత రోజుల్లో ఆరోగ్యంగా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే రకరకాల వైరస్‌ను వెంటాడుతున్నాయి. అలాగే జీవన శైలిలో కూడా మార్పులు చేసుకోవడం ఎంతో ముఖ్యం.

ఆయుర్వేద నిపుణుడు డాక్టర్ BN సిన్హా ప్రకారం, “సీతాఫలంలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం మరియు మరిన్ని ఉన్నాయి. ఈ పోషకాలు మొత్తం ఆరోగ్యానికి ఉపయోగపడతాయి.” అయినప్పటికీ, దాని గొప్ప తీపి రుచి ప్రకటన కండకలిగిన ఆకృతి కారణంగా, మధుమేహం ఉన్నవారు తమ ఆహారంలో సీతాఫలాన్ని తరచుగా దూరంగా ఉంచుతారు.

సమయానికి తినకపోవడం, ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి తదితర కారణాల వల్ల మనిషి అనారోగ్యం బారిన పడుతున్నాడు. అలాగే మనం పీల్చే గాలి వల్ల కూడా రకరకాల వ్యాధులు వ్యాపిస్తున్నాయి. ఇక ప్రతి సీజన్‌లో దొరికి పండ్లను తినడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. ప్రతి రోజు పండ్లను తినడం వల్ల కూడా ఎన్నో ఉపయోగాలున్నాయి. వీటి వల్ల వివిధ వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చు. కొన్ని పండ్లు ఏడాది పొడవునా లభిస్తుంటే.. మరి కొన్ని పండ్లు సీజన్‌లో మాత్రమే లభిస్తాయి. అలాంటి పండ్లను మాత్రం వదిలిపెట్టకుండా తింటే ఎన్నో ఉపయోగాలున్నాయంటున్నారు వైద్య నిపుణులు.

ఈ వర్షాకాలంలో వినాయక చవితి నుండి విరివిగా లభించేవి సీతాఫలం. ఈ పండ్లలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. అందుకే దీనిని విటమిన్లు, ఖనిజాలు కలిగిన పోషకాల ఘని అంటారు. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, రాగి పుష్కలంగా ఉంటాయి. సీతాఫలం అల్సర్లను నయం చేయడంలోనూ, అసిడిటీని నివారించడంలో ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే సూక్ష్మపోషకాలు మీ చర్మాన్ని మృదువుగా చేస్తాయి.

కంటి చూపును మెరుగు పరుస్తుంది

ఈ పండ్లు కంటి చూపును మరింతగా మెరుగు పరుస్తాయి. జుట్టుని, మెదడు పనితీరు మెరుగుపర్చడంలో ఉపయోగపడుతుంది. సీతాఫలంలోని ఐరన్ కంటెంట్ ఐరన్ లోపాన్ని తగ్గించి, హిమోగ్లోబిన్ మెరుగుపరిచి రక్తహీనతను నివారించగలదు. సీతాఫలంలోని బయోయాక్టివ్ అణువులు, యాంటీ ఒబెసియోజెనిక్, యాంటీ డయాబెటిస్, క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి.సీతాఫలం గ్లైసెమిక్ ఇండెక్స్ 54, అంటే లో-గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. అయితే డయాబెటిస్‌ వారు కూడా తినొచ్చట. కానీ మితంగా తినాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు.

సీతాఫలంలో ఫైబర్‌..

సీతాఫలంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఔషధంగా ఉంటుంది. కాకపొతే, ఇది అధిక కేలరీలను కలిగి ఉంటుంది కనుక మోతాదుకి మించి సీతాఫలాలు తీసుకోకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అధిక క్యాలరీలు కలిగిన ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే బరువు తగ్గడేమో కానీ మళ్లీ అధిక బరువు పెరిగే ప్రమాదం ఉందంటున్నారు. ఇక ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ మలబద్దకాన్ని అరికడుతుంది. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం అధిక రక్తపోటును తగ్గిస్తుంది.

మధుమేహ వ్యాధిగ్రస్తులు సీతాఫలాన్ని తినవచ్చా?
సీతాఫలాన్ని పోషకాల సాంద్రత అని ఎందుకు అంటారు? మధుమేహం ఉన్నవారు తినవచ్చా?
అయితే మధుమేహం, గుండె జబ్బులు లేదా పిసిఒడి వంటి కొన్ని ఆరోగ్య పరిస్థితుల విషయంలో చాలా మందికి పండ్లను తీసుకోవడం గురించి ఆందోళనలు ఉంటాయి. దీనికి విరుద్ధంగా సీతాఫలం లేదా సీతాఫలం మధుమేహం ఉన్నవారికి తక్కువ GI (గ్లైసెమిక్ ఇండెక్స్) ఆహారంగా పరిగణించబడుతుంది మరియు మీ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచదు.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *